VIDEO: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బాధితుడి తల్లి ఆవేదన
WGL: ఖిలా వరంగల్ మండలంలోని పడమరకోటలో గల ఓ స్వీట్ హౌస్‌లో కొంతమంది యువకులు ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ గొడవకు తన కొడుకు చరణ్‌కి ఎటువంటి సంబంధం లేదని ఆమె తల్లి రజిత తెలిపారు. చరణ్ గంజాయి మత్తులో హల్చల్ చేశాడని వచ్చిన వార్తలు తమ కుటుంబాన్ని కలచివేశాయని, కొందరు కావాలనే తన కొడుకుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.