'డీసిల్టింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'డీసిల్టింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

అన్నమయ్య: సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు ఫీడర్, సప్లై చానళ్లలో డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లాలో గుర్తించిన 30కి పైగా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే మదనపల్లి- పీలేరు, రాయచోటి బైపాస్, మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని తెలిపారు.