VIDEO: యూరియా కోసం ఉదయమే క్యూ

ADB: పట్టణంలోని డాల్డా కంపెనీ గోదాం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతున్నప్పటికీ, యూరియా సరిపడా దొరకదేమోనన్న భయంతో రైతులు మహిళలతో కలిసి సోమవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. అధికారులు మాట్లాడుతూ.. పంటలకు అవసరమైన దానికంటే ఎక్కువ యూరియా వాడటం వల్ల నష్టాలు ఉంటాయని, మోతాదుకు మించి వాడకూడదని సూచించారు.