'ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి'
ADB: నూతన ఉట్నూర్ ITDA పీవో యువరాజ్ మర్మాట్‌ను NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ITDA పరిధిలోని ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చలినీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు హీటర్ సౌకర్యం కల్పించి వేడినీటిని అందించాలని సూచించారు.