రైల్వే స్టేషన్ గోడను ఢీకొట్టిన కారు(VIDEO)
W.G: పాలకోడేరు మండలం శృంగవృక్షం రైల్వే స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి స్టేషన్ గోడను బలంగా ఢీకొట్టింది. పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.