VIDEO: 'బాలికల వసతి గృహ భవన నిర్మాణం చేపట్టాలి'
KMR: మద్నూర్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం భవన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సొంత భవనం లేక బాలికల వసతి గృహంను ఎస్సీ- ఏ బాలుర వసతి గృహంలో తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఎస్సీ-ఏ హస్టల్ విద్యార్థులు ఎస్సీ-బి హస్టల్లో ఉంటున్నారు. వెంటనే అధికారులు బాలికల వసతి గృహ భవనం నిర్మించాలని, లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని స్థానికులు తెలిపారు.