టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలి: సీపీఎం

VZM: బొబ్బిలి పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు కోరారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అప్పగించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, చైర్మన్ రాంబార్కి శరత్ బాబుకు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.