ఆలయం కోసం కాలినడకన దేశ యాత్ర!
దేశంలోని ప్రముఖ దేవాలయాల నుంచి సేకరించిన మట్టితో ఓ ఆలయాన్ని నిర్మించేందుకు ఓ వ్యక్తి 4 ఏళ్లుగా కాలినడకన దేశ యాత్ర సాగిస్తున్నాడు. UP కౌశాంబి జిల్లాకు చెందిన గౌరవ్ మాలవీయ(26) తన 2.7 లక్షల కి.మీ యాత్రలో భాగంగా.. ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో 54 వేల కి.మీ పూర్తిచేశాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన లక్ష్యం వైపు సాగుతానని గౌరవ్ చెప్పడం పలువురిలో ప్రేరణ నింపుతోంది.