'ఆ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయడమే లక్ష్యం'
PPM: వైద్యారోగ్యశాఖ నిర్దేశిత ప్రతీ ఆరోగ్య కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా పని చేయాలని DMHO డా. ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రోగ్రాం అధికారులు, కార్యాలయ సిబ్బందితో గురువారం సమావేశమై వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. అనంతరం ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, వైద్య సేవలపై సూచనలు ఇచ్చారు.