VIDEO: ఆగని బస్సు.. మహిళల ఆవేదన
WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో ఉచిత బస్సు పథకం అమలుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం దర్గాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్ స్టాప్ వద్ద నిలబడి బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు లేకపోయిన ఆగకుండా వెళ్లిపోయిందని వరంగల్‌కు చెందిన యాకుబీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.