కదిరి ప్రజలకు సీఎం చంద్రబాబు అభివృద్ధి వరాలు
సత్యసాయి: కదిరి నియోజకవర్గ ప్రజలకు సీఎం చంద్రబాబు అభివృద్ధి ప్రణాళికల రూపంలో అనేక వరాలు కురిపించారు. కదిరిలో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ స్థాపన, షాదీఖానాల నిర్మాణం, రెండు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యతతో పాటు 32 చెరువులు నింపే ప్రణాళికలు రూపొందించారు.