గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

JN: ధర్మకంచ మినీ స్టేడియంలో శనివారం ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 17వ గ్రామోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. గ్రామీణ యువత, మహిళల్లో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యాభివృద్ధి కోసం ఇలాంటి పోటీలు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. వాలీబాల్, త్రోబాల్ పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.