ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్

BHNG: బీబీనగర్ శివారులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిన్నేటి వాగును కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లోని లో-లెవల్ వంతెనలను మూసివేశామని, ప్రజలు, వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రవాహాన్ని దాటవద్దని హెచ్చరించారు. వాగుల తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.