జీపీ కార్మికులకు ఆర్థిక సహాయం
సిద్దిపేట: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఈ విషయాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి NRI దంపతుల దృష్టికి పలువురు తీసుకువెళ్లారు. వారు వెంటనే స్పందించి 9 మంది కార్మిక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున బతుకమ్మ, దసరా ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు.