బద్దెవోలులో సోమవారం పూజలు
NLR: మనుబోలు (M) బద్దెవోలులో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం కార్తీక మాసం కోటి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, లఘున్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం, సుగంధద్రవ్యాభిషేకం, నూతన వస్త్రధారణ, పుష్పాలంకరణ, కుంకుమార్చ చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.