ఓట్లేయకపోతే.. నిధులు ఇవ్వను: డిప్యూటీ సీఎం
ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకపోతే నిధుల కేటాయింపులో తాను అదే పని చేస్తానని మహారాష్ట్ర DY CM అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. NCPని గెలిపిస్తే హామీలను నెరవేర్చే విషయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. 'మీ దగ్గర ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర నిధులు ఉన్నాయి. మీరు తిరస్కరిస్తే.. నేనూ తిరస్కరిస్తా' అని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.