రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

అన్నమయ్య: గాలివీడు మండలంలోని నూలువీడు సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తినివాండ్లపల్లికి చెందిన శివారెడ్డి, ఆయన వదిన రెడ్డమ్మ గాలివీడు నుంచి గ్రామానికి వెళుతుండగా, అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.