పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు

MBNR: జడ్చర్లలోని గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం సమయానికి నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి, మంచి చదువుపై దృష్టి పెట్టి, క్రమశిక్షణతో సాగాలని వారికి దిశానిర్దేశం చేశారు.