నాలుగు రోజులు వైన్స్ బంద్

నాలుగు రోజులు వైన్స్ బంద్

TG: హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు, పబ్బులు, రెస్టారెంట్లను ఈ నెల 9 నుంచి 12 వరకు బంద్ చేయనున్నారు. కాగా, ఈ నెల 11న జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.