భర్త అక్రమ సంబంధం.. భార్య అత్మహత్యాయత్నం
అన్నమయ్య: మదనపల్లిలో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బసినికొండకు చెందిన గణేష్ అనే వ్యక్తి లారీలకు బాడీలు కట్టే పని చేస్తుంటాడు. భార్యాపిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. మనస్థాపంతో మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు.