పాఠశాల వద్ద పేలుడు పదార్థాలు లభ్యం..!
ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాల సమీపంలో పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. అల్మోరా జిల్లా దబారా గ్రామంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన ఉపాధ్యాయుడు అనుమానాస్పద వస్తువులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.