గోస్తనీ కాలువకు భారీగా వరద

గోస్తనీ కాలువకు భారీగా వరద

W.G: భారీ వర్షాల కారణంగా పెనుమంట్ర మండలంలోని గోస్తనీ కాలువలోకి భారీగా వరద నీరు చేరుతోంది. సోమరాజు ఇల్లింద్రపర్రులో వరి పంటలు ముంపులో చిక్కి చెరువులను తలపిస్తున్నాయి. మల్లిపూడి, జుత్తిగ, నత్తారామేశ్వరం, మాముడూరు ప్రాంతాల్లో మరో 3 వేల ఎకరాలపై ముంపు ప్రభావం పడింది. నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో నీరు చేరింది.