రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
MLG: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం పరిధిలో కారు అదుపుతప్పి గుంతలో పడి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కన్నాయిగూడెం మండల కేంద్రానికి చెందిన పీర్ల ప్రదీప్ తుపాకులగూడెంలోని ఓ వివాహ వేడుకకు కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో పడింది. పీర్ల ప్రదీప్ తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.