పారిశుద్ధ్యం లోపంపై సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం

KRNL: నగరంలో పారిశుద్ధ్య స్థితిపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేసిన వ్యాఖ్యలు నిజమేనని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. పెద్ద మార్కెట్‌లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించిన ఆయన, పరిసరాలు కలుషితం కావడంపై పారిశుద్ధ్య అధికారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఖాళీ షాపుల మరమ్మతులు, నిర్వహణను రెవెన్యూ శాఖ పర్యవేక్షించాలని సూచించారు.