మిర్జాపూర్‌లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

KMR: నసురుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి పోతునూరు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీ దుర్గాప్రసాద్ గురుస్వామి ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శంకరప్ప, గణేష్, తదితరులు పాల్గొన్నారు.