గుప్తా నిధుల తవ్వకం ముఠాను పట్టిన గ్రామస్థులు

KMR: జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామంలోని పురాతన బసవేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న పదిమంది ముఠాను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భిక్కనూరు, ర్యాగట్లపల్లి, మెదక్ జిల్లా రామాయంపేట ప్రాంతాలకు చెందిన ఈ ముఠా శనివారం మధ్యాహ్నం జేసీబీతో తవ్వకాలు చేపట్టింది. గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.