VIDEO: ఘనంగా పోచమ్మ బోనాలు

VIDEO: ఘనంగా పోచమ్మ బోనాలు

KNR: గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకుని మహిళలు ఆలయానికి తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.