ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో విశాఖలో తనిఖీలు
VSP: ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని చెక్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు.