వాంబే కాలనీలో రెండు బైక్‌లు దగ్ధం

వాంబే కాలనీలో రెండు బైక్‌లు దగ్ధం

NTR: విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీలో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి ఇంటి వద్ద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఉదయం స్థానికులు చూసేసరికి వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. వాహనాల్లో పెట్రోల్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.