ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన బైకు

ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన బైకు

NLR: మర్రిపాడు మండలం ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ సమీపంలో శుక్రవారం బైక్ అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను స్థానికులు బయటకు తీసి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.