ఆకర్షిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం

ఆకర్షిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం

NLG: జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం 31,392 హెక్టార్లలో విస్తరించి పర్యాటకులను ఆకర్షిస్తుంది. నల్లమలలో చిరుతలు చిందులేస్తున్నాయి, ఎలుగుబంట్ల పరుగులు, తోడేళ్ల తైతక్కలాటలు, నెమళ్ల నాట్య విన్యాసం తదితర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ  26 చిరుత పులులు, ఎలుగుబంట్లు 50, రేసు కుక్కలు 105 ఉన్నాయి. గత ఏడాది పెద్దపులి కంబాలపల్లి రేంజ్‌ పరిధిలో ట్రాప్ కెమెరాలో చిక్కింది.