అనారోగ్యంతో AR హెడ్ కానిస్టేబుల్ మృతి
WGL: అనారోగ్యంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో జరిగింది. పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న యండీ సాజీద్ అనారోగ్యం పాలయ్యారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. 1995వ బ్యాచ్‌కు చెందిన సాజీద్.. పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులకు గన్ మెన్‌గా సమర్థవంతంగా పనిచేశారు.