కమ్యూనిటీ హాలు ప్రారంభించిన గొట్టిపాటి

కమ్యూనిటీ హాలు ప్రారంభించిన గొట్టిపాటి

AP: బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా తూర్పుకొప్పెరపాడులో గోకులం షెడ్డు, కమ్యూనిటీ హాలు ప్రారంభించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజాసమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.