నేడు టీడీపీ కీలక సమావేశం

AP: ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీపీ కీలక సమావేశం జరుగనుంది. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరోలో మార్పులు ఉండవచ్చు. జిల్లా స్థాయిలో ముగ్గురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిపైనా నేటి సమావేశంలో చర్చ జరగనుంది.