వారిని విడదీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: పంత్

వారిని విడదీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: పంత్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓటమిపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. 'అనవసర ఒత్తిడితో వికెట్లు పారేసుకున్నాం. పిచ్ కూడా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యంతో మా ఓటమిని శాసించారు. ఈ భాగస్వామ్యాన్ని త్వరగా విడదీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది' అని పేర్కొన్నాడు.