ట్రైలర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని పేరవరం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న ట్రైలర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా, పలువురికి గాయాలయినట్లు సమాచారం. గాయపడిన వారిన స్థానికులు ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.