కలెక్టర్‌ను కలిసిన వ్యాయామ ఉపాధ్యాయిని
ప్రకాశం: రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ANUలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మార్కాపురం బాయ్స్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయిని డోల శ్యామలాదేవి ప్రతిభ చాటారు. 45 వయస్సు విభాగంలో హై జంప్‌లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆమెను అభినందించారు.