కందుకూరులో తప్పిన పెను ప్రమాదం

కందుకూరులో తప్పిన పెను ప్రమాదం

NLR: కందుకూరులో బుధవారం ఓ ఆటోకు ప్రమాదం తప్పింది. పడమటి వడ్డెపాలెంలో కరెంట్ స్తంభం విరిగి రోడ్డుపై వెళ్తున్న ఆటో మీద పడింది. స్థానికులు వెంటనే అధికారులకు తెలపడంతో హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు లేరని తెలిసింది.