ఆయన త్యాగం భావితరాలకు ఆదర్శం: లోకేష్

ఆయన త్యాగం భావితరాలకు ఆదర్శం: లోకేష్

AP: పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి లోకేష్ నివాళులర్పించారు. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని అన్నారు. 'సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేశారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శం. పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం' అని పిలుపునిచ్చారు.