సమస్యలను అడిగి తెలుసుకున్న DBF నేతలు
HNK: దామెర మండలంలోని లాదెళ్లలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజల సమస్యలను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నేతలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసే వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు.