స్టేమీ కార్యక్రమంలో రూ. 45 వేలు ఇంజక్షన్ ఉచితం

స్టేమీ కార్యక్రమంలో రూ. 45 వేలు ఇంజక్షన్ ఉచితం

కృష్ణా జిల్లా: నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుండె సంబంధ వ్యాధికి ప్రభుత్వం స్టెమీ కార్యక్రమం ద్వారా రూ. 45 వేలు విలువచేసే ఇంజక్షన్ ను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ హరికృష్ణ తెలిపారు. గుండెనొప్పి వచ్చిన తర్వాత ఇంజక్షన్‌ను ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. గుండె సంబంధ వ్యాధులకు టెస్టులు ఉచితంగా చేస్తామన్నారు.