గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు: విక్రమ్ సోలంకి

గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. గిల్ కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని కొనియాడాడు. కెప్టెన్సీ అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని సోలంకి స్పష్టం చేశాడు. గిల్ ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు.