102 అమ్మఒడి సేవలు.. బాలింతలకు వెలకట్టలేని భరోసా

102 అమ్మఒడి సేవలు..  బాలింతలకు వెలకట్టలేని భరోసా

గద్వాల్ జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న 102 అమ్మఒడి అంబులెన్స్ సేవలు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అమూల్యమైన భరోసానిస్తున్నాయి. జిల్లాలో 10 అమ్మఒడి అంబులెన్సులు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి. గర్భధారణ నుంచి ప్రసవం వరకు, అలాగే ప్రసవం తర్వాత తల్లి-బిడ్డలను ఆరోగ్య కేంద్రాలకు, ఇంటికి ఉచితంగా తరలించడంలో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.