VIDEO: విద్యుత్ షాక్‌తో బాలికకు తీవ్ర గాయాలు

VIDEO: విద్యుత్ షాక్‌తో బాలికకు తీవ్ర గాయాలు

MHBD: కొత్తగూడ మండలం మాసంపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావ్యశ్రీ ఇంటి స్లాబ్‌పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ మెయిన్ లైన్ వైర్లను తాకడంతో షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని గమనించిన తల్లిదండ్రలు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. హూటాహూటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలికను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.