క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన ల‌క్ష్య‌సేన్

క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన ల‌క్ష్య‌సేన్

జపాన్ మాస్టర్స్ 2025లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తన సత్తా చూపిస్తున్నాడు. జియా హెంగ్ (సింగపూర్)తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో విజయం సాధించాడు. 39 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌లో 21-13, రెండో సెట్‌ను 21-11తో సొంతం చేసుకున్నాడు. సెమీస్ బెర్తు కోసం లేహ్ కీన్ యెవ్‌ను లక్ష్యసేన్ ఢీకొట్టనున్నాడు.