VIDEO: మృతిపై నిపుణుల కమిటీ విచారణ
విశాఖలో బెహరా ఆసుపత్రిలో జరిగిన కె. వెంకటరావు మృతి ఘటనపై సోమవారం కేజీహెచ్‌లో వైద్య నిపుణుల కమిటీ విచారణ చేపట్టింది. తప్పు వైద్యం కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదవగా, కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు మృతుడి కుమారుడు శ్యామ్ ప్రసాద్ వాంగ్మూలం నమోదు చేశారు. అనస్థీషియా ఇచ్చిన వెంటనే మరణించారని ఆరోపించారు.