చెరువులో పడి వ్యక్తి మృతి
VZM: బాడంగి మండలం రావివలస గ్రామంలోని చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘలనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.