'అన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలి'
ATP: జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ గురువారం గుత్తి ఏడిఏ వెంకటరాముడుకు వైసీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ, పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 25,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు.