యారోనిపల్లిలో టీబీ క్యాంప్
MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా టీబీ క్యాంప్ నిర్వహించారు. సర్పంచ్ స్వాతి ఆధ్వర్యంలో 114 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వైద్యులు క్షయ లక్షణాలపై అవగాహన అవసరమని, సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సంతోష, మేఘన, కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.