కండోమ్‌లపై 13 శాతం పన్ను
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పన్ను మినహాయింపు పొందుతున్న కండోమ్‌లపై 13% వ్యాట్ విధిస్తున్నట్లు ప్రకటించింది. 3 ఏళ్లుగా దేశంలో జననాల రేటుపడిపోతుండటంతో ప్రజలను పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు 'ఒకే బిడ్డ' విధానాన్ని అమలు చేసి.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.